Vastu Tips : సాధారణంగా పెద్ధల నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరికీ ఉండే ముఖ్యమైన విషయం మంచి ఇల్లు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఉండే ఇష్టం. కాగా వారి వారి ఆర్ధిక పరిస్థితులను బట్టి ఆ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటి నిర్మాణం విషయంలో మనం చాలా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటాం. పునాది దగ్గర నుంచి పెయింట్స్ వరకు ప్రతి విషయంలో మన ఇష్టాలకు తగ్గట్లు గానే కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాం. అయితే వాస్తు ప్రకారం మనం వంటగదిలో ఉపయోగించే కొన్ని రంగులు సంబంధించిన ఉపయోగించడం వల్ల వచ్చే ప్రభావాల గురించి మీకోసం ప్రత్యేకంగా..
వంటగదిలో ప్రధానంగా ఉపయోగించే రంగుల గురించి (Vastu Tips)..
ఆరెంజ్..
వాస్తు ప్రకారం ఆరెంజ్ కలర్ వంటగదిలో వేయడం వల్ల వ్యక్తుల మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ కలర్ ధైర్యం, బలాన్ని పెంచడంతో పాటు నూతన శక్తిని ఇస్తుందని సూచిస్తున్నారు.
తెలుపు..
తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం వంటగదిలో తెలుపు రంగు సానుకూల శక్తి ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. వంటగది వాయువ్యంలో నిర్మిస్తుంటే తెలుపు రంగు కంటే మరో బెస్ట్ ఛాయిస్ ఉండదు అని తెలుపుతున్నారు.
ఆకుపచ్చ..
ఆకుపచ్చ రంగుని ఆశ, శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ రంగు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఆకుపచ్చ రంగును ఉపయోగించడం వల్ల పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి అని చెబుతున్నారు.
పసుపు..
వాస్తు ప్రకారం పసుపు రంగును చాలా ప్రత్యేకమైందిగా పరిగణిస్తారు. కిచెన్ కు పసుపు రంగు వాడటం వల్ల కాంతి అంతా ఆ గదిలోనే ఉంటుందని.. అలానే సానుకూల శక్తినిచ్చి ప్రోత్సహిస్తుందని అంటున్నారు.
గులాబీ..
పింక్ ని ప్రేమకు సంకేతంగా పరిగణిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్ఫర ప్రేమను ప్రోత్సహించేందుకు.. ఒకరికొకరు సామరస్యంగా జీవించడానికి ఈ రంగు ప్రేరేపిస్తుంది. వాస్తు ప్రకారం ఇది పరిపూర్ణమైందిగా చెబుతారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/