Vastu Tips : మన భారతీయ పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే తులసి మొక్కకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ.. శ్రీ మహా విష్ణువుకు నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని కూడా చాలా మంది నమ్ముతారు. అదే విధంగా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే తులసికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం ప్రత్యేకంగా..
తులసి మొక్కను ఏ దిక్కులో ఉంచాలి? (Vastu Tips) ఏ దిక్కులో ఉంచకూడదు??
తులసి మొక్కను ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల మంచి జరుగుతుందని అందరికీ తెలిసిందే. కానీ తులసిని ఏ దిక్కున ఉంచాలి అనే విషయం కూడా ముఖ్యంగా పరిగణించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీని వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య(తూర్పు దిశ) దిక్కులను ఎంచుకోవచ్చు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.
అలానే తులసి మొక్కను దక్షిణ దిశలో ఎప్పటికీ నాటకూడదు. ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. పొరపాటున ఆ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కూడా కలహాలు పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పూజా కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలి (Vastu Tips)..?
మనలో కొందరు వ్యక్తులు తమ ఇంటి పైకప్పు మీద తులసి మొక్కలను ఉంచుతుంటారు. వాస్తు ప్రకారం, అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలొస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముళ్ల పొదలకు దగ్గర్లో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అయితే అరటి చెట్టుకు దగ్గర్లో తులసిని నాటొచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లు భావిస్తారు. ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లను వేయకూడదు.. పూజలు కూడా చేయకూడదు. అంతేకాదు ఈరోజున తులసి ఆకులను తెంచకూడదని పండితులు చెబుతారు. సూర్య, చంద్ర గ్రహణం రోజున, సోమవారం, బుధవారం, ఆదివారం రోజున, ఏకాదశి తిథి వేళ తులసి మొక్కను కనీసం తాకకూడదు అని కూడా చెబుతారు.
శాస్త్రాల ప్రకారం, తులసి మొక్కను నాటేందుకు కార్తీక మాసాన్ని ఉత్తమ సమయంగా చెబుతారు పండితులు. ఈ నేపథ్యంలో ఈ నెలలో అద్భుతమైన సమయం వచ్చింది కాబట్టి తులసి మొక్కను తూర్పు లేదా ఈశాన్య, ఉత్తర దిశలో నాటండి. కార్తీక మాసంలో కూడా గురువారం రోజున తులసి మొక్కను నాటడానికి సరైన రోజుగా పరిగణిస్తారు. ఈ సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసంతో పాటు ఛైత్ర మాసంలోనూ శుక్రవారం రోజున తులసి మొక్కలను నాటేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెబుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/