Vastu Tips : హిందూ మత ఆచారం ప్రకారం.. లక్ష్మీదేవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మి దేవీ నివాసం ఉండే చోట ఎవ్వరికీ, ఎలాంటి కష్టం ఉండదని చెబుతుంటారు. లక్ష్మీ దేవి కటాక్షం ఉంటే జీవితంలో ఏ వెలితి లేకుండా సకల సౌకర్యాలు సమకూరుతాయని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ ధన లక్ష్మీ ఆశీస్సులు కావాలని.. దేవి అనుగ్రహం మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మహా లక్ష్మీ అడుగు పెట్టిన చోటల్లా శుభ ఫలితాలు, శుభ సంకేతాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను కనిపిస్తాయట. ఆ సంకేతాలను బట్టి లక్ష్మీ దేవి అనుగ్రహం త్వరలోనే కలగబోతుందని గ్రహించండి. ఆ సంకేతాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
ఆ శుభ సంకేతాలు ఏంటంటే (Vastu Tips)..
నల్ల చీమలు..
ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం జరిగితే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని సంకేతం లభించినట్లే. అలానే ఏదైనా వస్తువును చీమలు ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభిస్తే.. మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని అంటున్నారు.
పక్షి గూడు..
ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే, అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది.
మూడు బల్లులు..
మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకేచోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే, అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజూ తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు.
కలలో ఇవి కనిపిస్తే..
మీరు నిద్ర పోతున్నపుడు రాత్రి కలలో చీపురు, గుడ్లగూబ, కాడ, ఏనుగు, ముంగిస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ వంటివి కనిపిస్తే, మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు.
ఉదయాన్నే వీటిని చూస్తే..
ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే, అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం. అలాగే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు చెరకును చూస్తే, అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, దారిలో కుక్క నోట్లో శాఖాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే, మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం.
కుడి చేయి..
మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే, మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలొస్తాయని అర్థం.
ఈ సంకేతాల ద్వారా మీ ఇంటికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభించనుందని అర్దం చేసుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో కూడా ఈ సంకేతాలు కనిపిస్తే మీ జీవితాల్లోకి లక్ష్మీదేవి కటాక్షం వస్తుందని భావించవచ్చు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/