Site icon Prime9

Matka Teaser: వరుణ్ తేజ్ ‘మట్కా’ టీజర్ రిలీజ్.. డైలాగ్స్ గూస్‌బంప్స్

Varun Tej’s Stunning Performance Steals the Matka Teaser: టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించగా.. పలాస మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్‌తో పాటు సెట్స్‌లో ఉన్న ఫోటోలు లీక్ కావడంతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్‌డేట్ ప్రకటించారు.

పాన్ ఇండియా మూవీ మట్కా సంబంధించి అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విజయవాడ యువరాజ్ సెంటర్‌లోని జీ3 సినిమా హాల్‌లో మట్కా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సినిమా 1958 నుంచి 1982 వరకు సాగే పీరియాడిక్ కథలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపంచనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాి. ఇందులో భాగంగానే 1980 బ్యాక్ గ్రౌండ్‌లో విశాఖ ప్రాంతాలను రీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ను పరిశీలిస్తే.. విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి లేదా ఈ వాసు గుర్తుకు రావాలని అని వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక, ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version