US Former President Jimmy Carter dies at 100: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉన్న తన ఇంట్లో డిసెంబర్ 29న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జిమ్మీ కార్టర్.. గత కొంతకాలంగా కాలేయం, మెదడుకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతుండగా.. తాజాగా, ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెననోమా వ్యాపించి మృతి చెందినట్లు అతని తనయుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 చెప్పారు.
అయితే విషయం తెలుసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ సంతాపం తెలిపారు. అలాగే కాబోయే అమెరికా అధ్యక్షుడు సైతం ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. కాగా, అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్‌లో అధికారిక లాంభనాలతో అతని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది.
1924 అక్టోబర్ 1వ తేదీన జార్జియాలో జన్మించిన జిమ్మీ కార్టర్.. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. 1976లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి గెరాల్డ్ ఫోర్డ్‌పై గెలుపొంది మొదటిసారి వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు 1977 నుంచి 1981 వక్ె 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానంగా వ్యాధుల కట్టడి, శాంతి స్థాపన, మానవ, పౌర హక్కులు తదితర విషయాలపై తనదైన ముద్ర వేశారు. అలాగే ఆయన ఓ రైతుగా, నేవి ఉద్యోగి, గవర్నర్, ప్రెసిడెంట్‌గా అందరికీ సుపరిచితులుగా పేరు పొందారు. అంతేకాకుండా ఆయన 2002 లో నోబెల్ బహుమతి సైతం పొందారు. అయితే ఆ తర్వాత 1980వ ఏడాదిలో జరిగిన ఆయన ఓటమి పాలయ్యాడు.