Site icon Prime9

Tollywood Best Movies in 2024: 2024లో విడుదలైన సినిమాలు.. బంపర్ హిట్‌తో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 చిత్రాలివే?

Top 10 Highest Grossing Tollywood Movies in 2024: 2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాదిలో టాలీవుడ్‌లో 100కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. ‘హనుమాన్’ బంపర్ హిట్‌తో ఏడాది ఘనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కల్కి 2989 ఏడీ, స్త్రీ2, గోట్, టిల్లూ స్క్వేర్, కమిటీ కుర్రాళ్లు, ఆయ్, 35 చిన్న కథ కాదు, సరిపోదా శనివారం, దేవర-1, అమరన్, క, పుష్ప-2 వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వగా.. మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.

పుష్ప-2 సినిమా రూ.1600 కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ సినిమాల జాబితాలో తొలిస్థానంలో ఉండడంతో పాటు అత్యధిక వసూళ్లు చేసిన ఇండియన్ మూవీగా రికార్డు నెలకొంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

దేవర రూ.405 కోట్లు వసూళ్లు చేయగా.. హనుమాన్ రూ.300 కోట్లు, గుంటూరు కారం రూ.172 కోట్లు, టిల్లు స్క్వేర్ 132.75 కోట్లు, లక్కీ భాస్కర్ రూ.108 కోట్లు, సరిపోదా శనివారం రూ.95 కోట్లు, ‘క’రూ.39కోట్లు, నా సామి రంగ రూ.30 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి అతి పెద్ద విజయాన్ని సాధించి రెండో స్థానం లో ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర మూడో స్థానంలో ఉంది. ఏడాది ప్రారంభంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ ఊహించని హిట్ కొట్టింది.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది పెద్ద సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. విక్టరీ వెంకటేష్ నటించిన సైందవ్ మూవీ కమర్షియల్‌ గానూ డిజాస్టర్‌గా నిలిచింది. అదే విధంగా ఈగల్ సినిమా కూడా ఎలివేషన్స్‌తో ఉండడంతో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అర్జున్ రెడ్డి తరహాలో సిద్ధార్థ్ రాయ్ విఫలమైంది. విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాకు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కావడం లేదు. అలాగే, అల్లరి నరేష్.. ఆ ఒక్కటీ అడక్కు, విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, శ్రీ విష్ణు నటించిన శ్వాగ్ డిజాస్టర్ అయ్యాయి.

Exit mobile version
Skip to toolbar