Site icon Prime9

Telangana High Court: గ్రూప్- 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Telangana High Court Green Signal For Group-1 Mains: తెలంగాణలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు పరీక్ష నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, ఈ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

దీంతో షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథావిధిగా జరగనున్నాయి. గ్రూప్- 1 ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నలకు సంబంధించి ఫైనల్ కీలో సరైన సమాధానాలు ఇవ్వలేదని, ఆ ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ కొత్త జాబితాను విడుదల చేయాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో గ్రూప్- 1 మెయిన్స్‌కు ఎంపిక అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని కోరారు. అయితే. తాజాగా, విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే గ్రూప్- 1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది.

Exit mobile version