Rajyasabha ByElections: రాజ్యసభలోకి మరో ముగ్గురు.. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం

TDP Leaders Taking Oath’s as Rajya Sabha MP’s in Telugu: ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్‌ఖడ్ ఆ ముగ్గురితో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఇటీవల ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్‌లతో పాటు బీజేపీ నుంచి బరిలో నిల్చున్నారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కాగా, ఈ నెల 13న ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ముగ్గురు సభ్యులకు రాజ్యసభలో సంపూర్ణ మద్దతు లభించింది. దీంతో ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ లభించింది. ఇక, భవిష్యత్తులో కేంద్రం తీసుకునే నిర్ణయాలపై కొంత ప్రభావం చూపనుంది. దీనికి సంబంధించిన నిర్ణయాలపై రాజ్యసభలో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు 164 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవమైంది.