Site icon Prime9

Tata Diwali Offer: టాటా గోల్డెన్ ఆఫర్.. సేఫెస్ట్ ఎస్యూవీపై బిగ్గెస్ట్ డిస్కౌంట్.. ఫీచర్లు చాలా స్మార్ట్ గురూ!

Tata Diwali Offer

Tata Diwali Offer

Tata Diwali Offer: టాటా మోటర్స్ నవరాత్రి, దసరా ఉత్సవాల ఆనందాన్ని రెట్టింపు చేయనుంది. పండుగల సందర్భంగా టాటా లగ్జరీ ఎస్‌యూవీ హారియర్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. హారియర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 15.49 లక్షలు, కానీ ఇప్పుడు ఆఫర్లపై మీరు దీన్ని రూ. 14.99 లక్షలకు దక్కించుకోవచ్చు. ఈ SUV డీలర్ల నుండి రూ. 50 వేల విలువైన ప్రయోజనాలను పొందుతోంది. ఇది కార్పొరేట్తగ్గింపు కింద అందుబాటులో ఉంటుంది. హారియర్, సఫారిపై కంపెనీ ఇదే విధమైన తగ్గింపులను అందిస్తోంది. దేశంలోని అత్యంత సురక్షితమైన కార్లలో హ్యారియర్ ఒకటి. ఇది భారతదేశంలో NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

Tata Harrier Features And Specifications
హారియర్‌లో కొత్త 4 స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్‌పై టచ్-ఆధారిత HVAC కంట్రోల్స్, కొత్త 12.30-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నావిగేషన్‌ సిస్టమ్, అప్‌డేటెడ్ 10.25 అంగుళాల డిజిటల్ డ్రైర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ SUVలోని డ్రైవర్ సీటును మెమరీ ఫీచర్లతో ఎలక్ట్రానిక్‌గా అడ్జస్ట్ చేయచ్చు. ఇది హర్మాన్ ఆడియోవర్క్స్‌తో కూడిన 10 JBL స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

భారతదేశంలోని NCAP క్రాష్ టెస్ట్‌లో హారియర్ SUV 5 స్టార్ రేటింగ్‌ను అందుకుంది. ఈ SUVలో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో లెవెల్ 2 ADAS టెక్నాలజీ ఉంది. ఇతర భద్రతా ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో ABS, EBDతో కూడిన ESP, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎమర్జెన్సీ కాల్, బ్రేక్‌డౌన్ అలర్ట్ ఉన్నాయి.

హారియర్‌లో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 167.6 bhp పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేయగలదు. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లింకై ఉంటుంది. దీనిలో మూడు డ్రైవ్ మోడ్‌ల కూడా ఉన్నాయి. ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్ ఉన్నాయి. ఇవి కాకుండా టాటా నార్మల్, రఫ్, వెట్ అనే మూడు ట్రాక్షన్ మోడ్‌లను కూడా ఆఫర్ చేస్తుంది.

Exit mobile version