New Delhi: విప్లవకవి వరవరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బీమా కోరేగావ్ కేసులో నిందితుడుగా ఉన్న వరవరరావుకు అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేసింది. ఇచ్చిన బెయిల్‌ను ఎలాంటి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు బెంచ్ జడ్జి యుయు లలిత్ ఆదేశించారు. ఇదిలా ఉండగా 83 ఏళ్ల వరవరరావు బాంబే హైకోర్టు ఆర్డర్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కాగా బాంబే హైకోర్టు వరవరరావు శాశ్వత బెయిల్‌ను తిరస్కరించడంతో గత నెల 12న లొంగిపోవాల్సింది. అయితే సుప్రీంకోర్టు వరవరరావు తాత్కాలిక బెయిల్‌ను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పొడిగించింది.
ఇక ఈ కేసు విషయానికి వస్తే పూనేలో డిసెంబర్ 31, 2017లో ఎల్గార్ పరిషత్ సమావేశంలో వరవరరావు రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, దీంతో మరుసటి రోజు కోరేగావ్ -బీమా వార్ మొమోరియల్ వద్ద పెద్ద ఎత్తు హింస చెలరేగింది. ఈ సమావేశం మావోలతో లింకులు ఉన్న వారు ఏర్పాటు చేశారని పూనే పోలీసులు చెబుతున్నారు. అటు తర్వాత ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఆగస్టు 28, 2018లో హైదరాబాద్‌లోని రావు స్వగృహంలో అరెస్టు చేశారు. ఆయన పై పోలీసులు జనవరి 8, 2018న ఇండియన్ పీనల్ కోడ్‌ని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.