Side Effects Of Smart Phones early morning: ప్రస్తుతం చేతిలో మొబైల్ లేకుండా ఉండడం కష్టతరంగా మారింది. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో ఫోన్ చూడడం అలవాటుగా మారింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి పనులు ఫోన్లతోనే గడుస్తున్నాయి. అయితే, ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం లేచిన వెంటనే తమ ఫోన్ లో నోటిఫికేషన్స్, ఈ మెయిల్స్, సోషల్ మీడియాల్లో వచ్చిన వివిధ సందేశాల ద్వారా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ ప్రభావం మానసిక స్థితిపై కూడా ప్రతికూలంగా ఉంటుందని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. దీంతో పాటు కళ్లపై విపరీతంగా ప్రభావం చూపడం కళ్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ చూడడం ద్వారా తలనొప్పి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతాయని వైద్యులు సైతం చెబుతున్నారు. ఒక్కోసారి లేచిన వెంటనే ఫోన్ చూస్తే.. మనం ఆ రోజూ చేయాల్సిన పనులకు ఆటంకం ఏర్పడవచ్చు. దీంతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ంటు్నారు.
ప్రధానగా చీకటిగా ఉన్న సమయంలో స్క్రీన్ చూడడంతో ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూలైట్ మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని కొన్ని పరిశోధనల్లో సైతం తేలింది. ఇలా జరిగితే నిద్రలేమి సమస్యలతో పాటు తలనొప్పి, మైగ్రేన్ వంటి విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, ఫోన్ తరుచుగా చూడడంతో మెడ నొప్పితోపాటు వెన్నునొప్పి పెరుగుతుందన్నారు. అయితే ఇలా నిరంతరం వ్యసనంగా మారి ఇతర పనులు పెండింగ్ లోనే ఉండిపోతాయి. కొన్ని నోటిఫికేషన్స్ చూసి ఆందోళన చెందుతున్నారు. కావున ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.