Site icon Prime9

Maoist Party: 9న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపు .. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

Sensational letter released by Maoist Party: ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం చెల్పాక ఎన్‌కౌంట‌ర్‌పై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. నమ్మక ద్రోహి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకే ఏటూరు నాగారంలో తమ సహచరులు అత్యంత కిరాతకంగా చంపారని, పోలీసులకు అప్రూవర్‌గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయే లాగా చేశారని తెలిపింది. స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్‌ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు కాల్చి చంపారని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండించింది.

9న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు
ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు.

Exit mobile version