Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్యోగులు కలిశారు. ఈ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ నీటిసరఫరా విభాగంలో కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు.

RWS Lab Employees Meets AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్యోగులు కలిశారు. ఈ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ నీటిసరఫరా విభాగంలో కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు.

రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు మొర్ర పెట్టుకున్నారు. ఇలా చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. గత మూడు నెలలుగా జీతాలు రావడంలేదని ల్యాబ్ ఉద్యోగులు వెల్లడించారు. దీనికి పవన్ కల్యాణ్ స్పందించారు. పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా చూస్తామని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

అయితే, ఉద్యోగం తిరిగి ఇప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని దివ్యాంగురాలు సుజన కుమారి విజ్ఞప్తి చేసింది. గత పదేళ్లుగా కడప జిల్లాలోని కమలాపురం ల్యాబ్‌లో పనిచేస్తుండగా.. 3 నెలల క్రితం ్యోగం నుంచి తొలగిచిన్లు వాపోయంది. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చూస్తామని పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు.