Site icon Prime9

Indian rupee: మరింత పతనమయిన రూపాయి విలువ.. డాలర్‌ తో పోల్చితే 80కి చేరిన భారత రూపాయి

Mumbai: వరుసగా ఎనిమిదో సెషన్‌లో కరెన్సీ బలహీనపడటం,ముడి చమురు పెరగడంతో మంగళవారం యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి 80 కి చేరుకుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే డాలర్‌తో రూపాయి మారకం విలువ బలంగా ఉన్నప్పుడు వారు అడ్మిషన్లు పొంది అందుకు అనుగుణంగా ఫీజులు చెల్లించారు. తాజాగా రూపాయి విలువ పడిపోవడంతో వారు తమ నెలవారీ బడ్జెట్ , ఫీజులకు మరింత మొత్తాన్ని వెచ్చింవలసి వస్తుంది. ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌లు మరియు దిగుమతి చేసుకున్న సాధారణ వస్తువులు అన్నీ ఖరీదైనవిగా మారుతాయి.

మరోవైపు రూపాయి విలువ క్షీణించడం వల్ల ఎగుమతిదారులకు స్వల్పకాలిక ఉపశమనం లభిస్తుందని అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎఇపిసి) ఎగ్జిక్యూటివ్ సభ్యుడు లలిత్ తుక్రాల్ బిజినెస్ టుడేతో అన్నారు. ఎగుమతిదారులు, ముఖ్యంగా గార్మెంట్స్‌లో డీల్ చేస్తున్న వారు మహమ్మారి సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆర్డర్‌లు రద్దు చేయబడ్డాయి మరియు చాలా సరుకులు డంప్ చేయబడ్డాయి. డాలర్ విలువ పెరిగినందున ప్రస్తుత రేట్లు ఆదాయాల్లో స్వల్పకాలిక మెరుగుదలకు దారి తీస్తాయని తుక్రాల్ అన్నారు.

 

Exit mobile version