Site icon Prime9

Cheteshwar Pujara: భారత్ భవిష్యత్ కోసం రోహిత్ శర్మ త్యాగం చేయాలి.. పుజారా ఆసక్తికర కామెంట్స్

Rohit Sharma should sacrifice his position for India’s future: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. అయితే తొలి టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. తర్వాత ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో రెండు రోజుల మ్యాచ్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో వచ్చాడు. అలాగే ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. కాగా, మూడో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా 14 నుంచి ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఆందోళన నెలకొంది. గత 6 ఏళ్లుగా ఓపెనర్‌గా రోహిత్ శర్మ విజయవంతగా కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం సరికాదని క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, రవిశాస్త్రితో పాటు సీనియర్ ఆటగాళ్లు టీమిండియిా మేనేజ్ మెంట్ ను తప్పుబడుతున్నారు. తాజాగా, రోహిత్ శర్మ ఓపెనింగ్‌పై భారత్ మాజీ క్రికెటర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులోనూ రోహిత్ శర్మ మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్ పుజారా సూచించారు. భారత జట్టు భవిష్యత్తు కోసం రోహిత్ శర్మ ఆలోచించి తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవాలని పుజారా సూచించాడు. అంతకుముందు అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లలో 9 పరుగులు చేశాడు. రోహిత్.. ఈ మ్యాచ్‌లో ఇబ్బంది పడ్డాడు. బంతిని టచ్ చేసేందుకు సైతం కష్టపడాల్సి వచ్చింది. చివరికి స్కాట్ బోలాండ్, పాట్ కమ్మిన్స్ చేతిలో వికెట్ కోల్పోయాడు.

Exit mobile version
Skip to toolbar