Site icon Prime9

Mukesh Ambani Diwali Gift: ఎంత పెద్ద మనసో.. అంబానీ దివాళి గిఫ్ట్.. ఐఫోన్ 16 దక్కించుకోండి!

Mukesh Ambani Diwali Gift

Mukesh Ambani Diwali Gift

Mukesh Ambani Diwali Gift: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ ఐఫోన్ ప్రియులకు శుభవార్త అందించారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సరికొత్త ఐఫోన్ 16 ను ఆకర్షణీయమైన ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని తీసుకొచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలతో పాటు, రిలయన్స్ డిజిటల్ కూడా కొత్త ఐఫోన్ 16 పై గొప్ప ఆఫర్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు ఆపిల్కొత్త స్మార్ట్‌ఫోన్‌లను అద్భుతమైన ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఎంపికలతో ఈ పండుగ సీజన్‌లో iPhone 16ను ఆర్డర్ చేయొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

iPhone 16 Offer
ఈ దసరా, దీపావళి సీజన్‌లో ఐఫోన్ 16 కొనాలనుకొనే వారికి అదిరిపోయే శుభవార్త ఉంది. ముఖేష్ అంబానీకి చెందిన ఒక వెంచర్ ఈ దీపావళికి iPhone 16పై తగ్గింపును అందిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కాకుండా మీరు రిలయన్స్ డిజిటల్‌లో iPhone 16 పై స్పెషల్ ఆఫర్‌లను కూడా చూడవచ్చు. కొత్త ఐఫోన్‌ సిరీస్‌ను భారీ తగ్గింపు ధరకు దక్కించుకోవచ్చు.

రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ సేల్ వచ్చింది. మీరు రిలయన్స్ డిజిటల్ నుండి ఐఫోన్ 16 కొనుగోలు చేస్తే మీకు రూ. 5000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. మీరు రిలయన్స్ డిజిటల్ నుండి స్టేట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐఫోన్ 16 కొనుగోలు చేస్తే తక్షణమే 5000 రూపాయల తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ. 79900, కానీ డిస్కౌంట్ తర్వాత మీరు ఈ ఫోన్‌ను రూ.74900 మాత్రమే. ఫోన్‌పై నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. దీని ద్వారా మీరు 6 నెలల పాటు ప్రతి నెల రూ. 12483 చెల్లించి ఎటువంటి వడ్డీ లేకుండా కొత్త iPhone 16ని మీ సొంతం చేసుకోవచ్చు.

iPhone 16 Features
ఈ స్మార్ట్‌ఫోన్ 60 Hz రిఫ్రెష్ రేట్‌, 6.10 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది అంగుళానికి 460 పిక్సెల్‌ల పిక్సెల్ డెన్సిటీతో (ppi) 1179×2556 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. iPhone 16 హెక్సా-కోర్ Apple A18 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే 48 మెగాపిక్సెల్ (f/1.6) ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ (f/2.2, అల్ట్రా వైడ్ యాంగిల్) కెమెరా ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. సెల్ఫీ కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ ఉంది. f/1.9 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఉంటుంది. iOS 18 ఆధారంగా రన్ అవుతుంది. ఫోన్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో వస్తుంది.

Exit mobile version