Site icon Prime9

RBI Interest Rates: ఆర్బీఐ కీలక అప్డేట్.. వడ్డీరేట్లు యథాతథం

RBI Monetary Policy Meeting: రిజర్వుబ్యాంక్‌ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అక్టోబర్ పాలసీ మీటింగ్‌లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు.

రెపోరేటును 6.5శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ద్రవ్యోల్భణం తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రెపోరేటును ఇలానే కొనసాగిస్తుంది. ఇలా ఎలాంటి మార్పు చేయకపోవడం ఇది పదోసారి కావడం విశేషం.

ఇందులో భాగంగానే ఈ సారి కూడా వడ్డీరేట్లను యథాతథంగా అవలంభిస్తున్నామని చెప్పారు. ఇన్‌ఫ్లేషన్ తగ్గుదల ఇంకా నెమ్మదిగా, అసాధారణంగానే ఉందన్నారు. యూఎస్ ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల మేర కోత విధించినా ఆర్బీఐ ఆచితూచి వ్యవరిస్తోంది.

Exit mobile version