Site icon Prime9

Samyuktha Menon: లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ‘సంయుక్త’.. క్లాప్ ఇచ్చిన రానా ద‌గ్గుబాటి

Rana Daggubati launches Samyuktha Menon’s new-age thriller: మ‌ల‌యాళీ బ్యూటి సంయుక్త మ‌రో కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేసింది. అయితే ఈసారి హీరోయిన్‌గా కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించ‌నుంది. సంయుక్త లీడ్ రోల్‌లో న్యూ ఏజ్ యాక్ష‌న్ డ్రామా కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు యోగేష్ తెరకెక్కిస్తున్నాడు.

సంయుక్త అంతకుముందు భీబ్లా నాయక్‌లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇంకా పట్టాలపై రాకముందే మరో సినిమా అప్డేట్‌ను ప్రకటించడంతో ఫ్యాన్స్ జోష్ మీద ఉన్నారు.

హాస్య మూవీస్‌ బ్యానర్‌లో రానున్న ఈ చిత్రం పూజ కార్యక్రమాలు బుధవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వ‌చ్చిన రానా ద‌గ్గుబాటి క్లాప్ ఇవ్వగా.. నిర్మాతలు దిల్‌ రాజు, కోనా వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Exit mobile version