Site icon Prime9

Vettaiyan: రజినీకాంత్ కొత్త మూవీ ‘వేట్టయాన్’ కలెక్షన్ల రికార్డు.. తొలి రోజే దుమ్ములేపింది.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Rajinikanth Vettaiyan box office collections: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’. ఈ సినిమాను టి.జె. జ్ఞాన‌వేల్ తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల అయింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అలాగే మంజు వారియర్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, రోహిణి అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ నటించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది.

ఇందులో రజినీకాంత్ మ్యానరిజం ఓ లెవల్‌లో ఉంది. ముఖ్యంగా రజినీకాంత్ స్టైల్ ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. అతని అభిమానులు రజినీను స్క్రీన్‌పై ఎలా చూడాలో అలా మేకర్స్ తీర్చిదిద్దారు. తాజాగా, ఫస్ట్ డే కలెక్షన్లు రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కోలీవుడ్ సినీ పరిశ్రమలో విడుదలైన ినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.77.90 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఇదే ఏడాది కోలీవుడ్‌లో విడుదలైన విజయ్ ‘ది గోట్’ అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా రూ.120 కోట్లు వసూళ్లు చేసి తొలిస్థానంలో నిలవగా.. ‘వేట్టయాన్’ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమా టైటిల్‌ను తెలుగులో మార్చకుండానే ‘వేట్టయాన్’ పేరుతో విడుదల చేశారు.

‘వేట్టయాన్’ మూవీ వివిధ ప్రాంతాల్లో కలెక్షన్ల పరంగా చూస్తే.. తమిళనాడులో రూ.25.65 కోట్లు వసూళ్లు చేయగా.. కర్ణాటకలో రూ.7.90 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.89కోట్లు వచ్చాయి. కేరళలో రూ.4.72కోట్లు, దేశంలో రూ.2.34 కోట్లు, ఓవర్సీస్ రూ.32.40కోట్లు వసూళ్లయ్యాయి. దీంతో మొత్తం వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ.77.90కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా కథ విషయానికొస్తే.. రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా చేశారు. నిజాయితీతోపాటు న్యాయం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఈ ఆఫీసర్‌ గంజాయి మాఫియా లీడర్‌ను ఎన్‌కౌంటర్ చేస్తాడు. తర్వాత గంజాయి మాఫియా గురించి సమాచారం ఇచ్చిన టీచర్ హత్యకు గురవుతుంది. ఈ కేసులో ఎలాంటి సంఘటనలు జరిగాయన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Exit mobile version