Site icon Prime9

Kaushik Reddy: మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

Police Notices To BRS MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ వివాదంలో ఉండే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఓ విషయంపై పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 9వ తేదీన పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హుజురాబాద్ చౌరస్తాలో దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా చేసేందుకు కౌశిక్ రెడ్డి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని వివరించారు. అనుమతి లేకుంగా ధర్నా చేసిన విషయంపై పోలీసులు ఆయనపై సెక్షన్ 35(3) బీఎన్ఎస్ యాక్ట్ కింద ఆయనతోపాటు పలువురి నాయకులకు నోటీసులు జారీ చేశారు.

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ప్రాంతంలో దళిత బంధుకు సంబంధించిన రెండో విడత నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ధళితులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పరిస్థితులు దారి తప్పాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే ఎవరికైతే దళిత బంధు డబ్బులు పడలేదో వారు నేరుగా ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చారు. అనంతరం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాలో పాల్గొనేలా చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరారు.

ఇదిలా ఉండగా, గతంలోనూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత రాయదుర్గం పోలీసులు 132,351(3) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

Exit mobile version
Skip to toolbar