PM Narendra Modi launches projects in Maharashtra: హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన కుట్రలన్నీ విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఇందుకోసం దాదాపు రూ.7,600కోట్లు ఖర్చు చేయనున్నారు.
హరియాణాలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని చెప్పారు. కాంగ్రెస్ విష బీజాలు నాటుతూ..హిందువులను విభజించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే చూస్తుందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతులు, దళితులు బీజేపీకే అండగా నిలిచారని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలపై దళితులు తెలుసుకోవాలని, కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునేందుకు మాత్రమే చూస్తుందనే విషయంపై అవగాహన ఉండాలన్నారు.
మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను సైతం కాంగ్రెస్ పార్టీ తప్పు దో పట్టిందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కానీ, తమకు కనీ మదతు ధర ఎవర ఇచ్చారో హరియాణా రైతులకు తెలుసని, అందుకే బీజేపీని గెలిపించారన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పారని మోదీ అన్నారు.