Phone Tapping Case Prabhakar Rao, Sravan Rao case updates: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు వినతిపత్రం అందించారు.
తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖ అధికారిగా పనిచేశానని పేర్కొన్నారు. రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తోందని మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుడు వద్ద ఉంటున్నానని పేర్కొన్నారు. అలాగే, చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్‌ను పోలీసులు కనుగొన్నారు.
ఇదిలా ఉండగా, ప్రభాకర్ రావుతో పాటు 6వ నిందితుడిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ ఇతర దేశాలకు వెళ్లారు. దీంతో వీరిని భారత్‌కు తీసుకొచ్చేందుకు తెలంగాణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వారిపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించిన సమాచారం ఇమ్మిగ్రేషన్, ఇంటర్ పోల్ కు చేరింది. దీంతో ప్రభాకర్ రావు అమెరికా పోలీసులకు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని వినతి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.