Site icon Prime9

iPhone 16: జాక్‌పాట్ కొట్టాడు.. రూ.90 వేల ఐఫోన్‌ రూ.27 వేలే.. ఆ ట్రిక్ ఎంటో తెలుసుకోండి!

iPhone 16

iPhone 16

iPhone 16: టెక్ బ్రాండ్ ఆపిల్ ఇటీవల తన ఐఫోన్ 16 లైనప్‌ ఫోన్లను రిలీజ్ చేసింది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అనే నాలుగు మోడల్‌లు ఉన్నాయి. భారతదేశంలో ఈ లైనప్ ప్రారంభ ధర రూ. 79,900, అయితే ఒక వినియోగదారుడు ఐఫోన్ 16 మోడల్‌ను రూ. 90 వేల ఫోన్‌ను కేవలం రూ. 27,000కి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అతని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత పెద్ద డిస్కౌంట్ ఎలా వచ్చిందో చెప్పండి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ రెడ్డిట్‌లోని ఒక వినియోగదారుడు ఐఫోన్ 16 256GB స్టోరేజ్ వేరియంట్‌నురూ. 27 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. భారత మార్కెట్‌లో ఈ వేరియంట్ ధర రూ.89,900గా ఉంది.  క్రెడిట్ కార్డ్ సహాయంతో చౌక ధరకు ఫోన్ ఎలా కొనుగోలు చేయగలిగారో చూపించే స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లో లభించే రివార్డ్ పాయింట్ల వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

ఐఫోన్ 16 (256GB) కొనుగోలు చేయడానికి తాను HDFC ఇన్ఫినియ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించానని అన్నారు. కేవలం రూ. 26,970 చెల్లించాల్సి ఉందని వినియోగదారు పేర్కొన్నారు. మిగిలిన రూ. 62,930 కార్డులో ఉన్న క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల ద్వారా చెల్లించానని వెల్లడించారు. ఐఫోన్ 16 ధరలో ఎక్కువ భాగం రివార్డ్ పాయింట్ల సహాయంతో చెల్లించినట్లు స్క్రీన్‌షాట్‌లో తెలుస్తుంది. చాలా క్రెడిట్ కార్డ్‌లు ప్రతి పేమెంట్‌పై వినియోగదారులకు కొన్ని రివార్డ్ పాయింట్‌లను ఇస్తుంది. ఈ పాయింట్లను డిస్కౌంట్లుగా ఉపయోగించవచ్చు.

రెడ్డిట్ పోస్ట్‌లోని మరో వినియోగదారు 62,930 రివార్డ్ పాయింట్‌లను సేకరించడానికి ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చిందని అడిగారు. దీనిపై ఐఫోన్ 16 కొనుగోలు చేసిన వినియోగదారు స్పందిస్తూ.. ‘దాదాపు రూ. 15 లక్షలు.’ అంటే, క్రెడిట్ కార్డ్ ద్వారా సుమారు రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లయితే, వినియోగదారు 62 వేల కంటే ఎక్కువ రివార్డ్ పాయింట్‌లను పొందారు. తర్వాత అతను ఐఫోన్ 16 కొనుగోలు చేసేటప్పుడు డిస్కౌంట్‌గా ఉపయోగించారు.

మీ వద్ద వేలకొద్దీ క్రెడిట్ కార్డ్ పాయింట్‌లు లేకపోవచ్చు. కానీ Apple స్టోర్, పార్టనర్ రిటైల్ స్టోర్‌లలో, కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లింపు చేస్తే వారికి క్యాష్‌బ్యాక్, తక్షణ తగ్గింపు రూ. 5000 ఇవ్వబడుతుంది.మీకు కావాలంటే పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా మీరు కొత్త iPhone 16ని తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version