OnePlus Cloud 11 Event: మెగా లాంచ్ లో ఒకేసారి 5 ప్రొడక్టులు రిలీజ్ చేసిన వన్ ప్లస్..

ప్రముఖ బ్రాండ్ వన్‌ప్లస్ కొత్తగా 5 ప్రొడెక్టులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో వన్‌ప్లస్‌ క్లౌడ్‌ 11 పేరుతో జరిగిన గ్లోబల్‌ ఈవెంట్‌లో ఈ ఉత్పత్తులను పరిచయం చేసింది.

OnePlus Cloud 11 Event: ప్రముఖ బ్రాండ్ వన్‌ప్లస్ కొత్తగా 5 ప్రొడక్టులను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఢిల్లీలో వన్‌ప్లస్‌ క్లౌడ్‌ 11 పేరుతో జరిగిన గ్లోబల్‌ ఈవెంట్‌లో ఈ ఉత్పత్తులను పరిచయం చేసింది.

వన్‌ప్లస్‌ 11 5జీ స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో2 , వన్‌ప్లస్‌ పాడ్ , వన్‌ప్లస్‌ టీవీ , వన్‌ప్లస్‌ రౌటర్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

వన్ ప్లస్ రిలీజ్ చేసిన ఈ ప్రొడెక్టులు, వాటి ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 

వన్‌ప్లస్‌ 11 5జీ

వన్‍ప్లస్ ప్రీమియమ్ ఫ్లాగ్‍షిప్ మొబైల్‍గా ఇది అడుగుపెట్టింది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను వన్‍ప్లస్ 11 5జీ కలిగి ఉంది.

ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 13తో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 50 ఎంపీ, 48 ఎంపీ, 32 ఎంపీ కెమెరాలను ఇస్తున్నారు.

వీటిలో హాసిల్‌బ్లాడ్‌ కెమెరా సాంకేతికతతోపాటు ఆక్యుస్పెక్ర్టమ్‌ లైట్‌ కలర్‌ ఐడెంటిఫయర్‌ను ఉయోగించారు.

ముందుభాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.56,999గా ఉంది.

ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్ జరుగుతుండగా.. ఈ నెల 14వ తేదీన ఓపెన్ సేల్‍కు వస్తుంది.

 

వన్ ప్లస్ 11ఆర్ 5జి

క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ సహా ప్రీమియమ్ మిడ్ రేంజ్‍లో అదిరిపోయే స్పెసిఫికేషన్లతో వన్‍ప్లస్ 11ఆర్ 5జీ విడుదలైంది.

దీని ప్రారంభ ధర రూ.39,999గా ఉంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్ నడుస్తుండగా.. ఫిబ్రవరి 28 నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.

50 మెగా పిక్సెల్ మల్టీ డైమెన్షనల్ కెమెరా ,8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా , 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాలు ఉండగా 4కే వీడియో తీయగలిగే సామర్ధ్యం ఈ ఫోన్ లో ఉంది.

వన్‌ప్లస్‌ పాడ్‌

వన్‌ప్లస్ నుంచి వస్తోన్న తొలి ట్యాబ్‌ ఇది. ఇందులో 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 11.61 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది.

దీనికి డాల్బీ విజన్‌ సపోర్ట్‌ కూడా ఉంది. మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ రన్ అవుతుంది. వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు.

9,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇది 67 వాట్‌ సూపర్‌వోక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏప్రిల్‌ నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ధర ఇంకా ప్రకటించలేదు.

వన్‌ప్లస్‌ టీవీ క్యూ2 ప్రో

క్యూఎల్‍ఈడీ 4కే డిస్‍ప్లే సహా ప్రీమియమ్ ఫీచర్లతో వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో భారత మార్కెట్‍లోకి వచ్చింది.

ఇది ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారిత ఆక్సిజన్‌ప్లే 2.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 70 వాట్‌ స్పీకర్స్‌ ఉన్నాయి.దీని ప్రారంభ ధర రూ.99,999గా ఉంది. మార్చి 10న సేల్‍కు వస్తుంది.

వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో 2

డైనో ఆడియో డ్యుయల్ సౌండ్ డ్రైవర్లతో వన్‍ప్లస్ బడ్స్ ప్రో2 ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. వీటి ధర రూ.11,999 గా ఉంది. ఫిబ్రవరి 14న సేల్‍కు వస్తాయి.

బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 9 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. స్టాండ్‌బై మోడ్‌లో 39 గంటలపాటు ఛార్జింగ్‌ ఉంటుదని కంపెనీ తెలిపింది.

మూడు మైక్రోఫోన్‌లు ఉన్నాయి. ఐపీ 55 వాటర్ రెసిస్టెంట్‌ ఉంది. యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ఉంది

 

వీటితో పాటు వన్‌ప్లస్ హబ్‌ 5జీ రౌటర్‌ను కూడా విడుదల చేసింది కంపెనీ. ఇది వైఫై 6ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5జీ, 4జీ సిమ్‌కార్డ్‌లను పెట్టుకోవచ్చు. జులైలో అమ్మకాలు ప్రారంభం అవుతాయి.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/