Site icon Prime9

Noel Tata: టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయల్ టాటా

Noel Tata Succeeds Ratan as Chairman of Tata Trusts: టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నోయెల్ టాటా.. టాటా స్టీల్ అండ్ వాచ్ కంపెనీ టైటాన్ వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నాడు. అలాగే శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ సభ్యుడిగా ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించిన నేపథ్యంలో ఆయన వారసుడిగా నోయల్ టాటాను ఎంపిక చేస్తూ బోర్డు సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.

రతన్ టాటాకు నోయల్ టాటా సోదరుడు అవుతాడు. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయల్.. 2000 సంవత్సరంలో టాటా గ్రూప్‌లో చేరారు. ఆ తర్వాత పలు కంపెనీల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version