Site icon Prime9

Haryana: హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ ప్రమాణం.. హాజరైన పవన్ కల్యాణ్

Nayab Singh Saini Takes Oath As Haryana CM: హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని షాలిమార్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయన చేత ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, వివిధ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వివిధ రాష్ట్రాల బీజేపీ నాయకులు హాజరయ్యారు.

హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారోత్సవానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు ఛండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. నూతన ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో వరుసగా మూడు సార్లు గెలుపొంది రికార్డు నెలకొ్పింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి వ్యతిరేకంగా వచ్చాయి. కానీ అక్టోబర్ 8న విడుదలైన ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను తలకిందులుగా చేశాయి.

ఈ ఫలితాల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది. ఇక, కాంగ్రెస్ పార్టీ 37 సీట్లకే పరిమితమైంది. పార్టీ విజయం కోసం పోరాడిన నాయబ్ సింగ్ సైనీకే బీజేపీ మొగ్గు చూపింది. అనంతరం ఆయనను శాసనసభా పక్ష భేటీలో ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.

Exit mobile version