Minister Uttam Kumar Reddy Announcement Distribution of thin rice: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత అర్హత ఉన్న అర్హులందరికీ సన్న బియ్యం ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
మరో రెండు నెలల్లో నే అందరికీ రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇస్తామన్నారు. ఈ మేరకు దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించే ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. అయితే రేషన్ అక్రమ రవాణాపై నిఘా పెట్టామన్నారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదే విధంగా కొత్త రేషన్ డీలర్ షాపులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కొత్త పంచాయతీల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పంచాయతీల్లో అవసరం ఉన్న చోట్ల కొత్తగా రేషన్ షాపులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.
అనంతరం ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూ సేకరణకు రూ.37 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. మరో వారంలో మరో రూ.22 కోట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా అన్ని ప్రాజెక్టులను ఓ సిస్టమ్ ప్రకారం పూర్తి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు కొనసాగుతున్నాయని, మరో రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అలాగే స్టేషన్ ఘన్ పూర్ కాల్వకు రూ.120 కోట్లు మంజూరు చేశామని, దీనికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.