Site icon Prime9

Minister Ponguleti Srinivas Reddy: అసెంబ్లీలో గూండాగిరి, దాదాగిరి చేస్తే సహించేది లేదు.. మంత్రి ఫైర్

Minister Ponguleti Srinivas Reddy in TG Assembly: అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్‌పై వేశారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలోనే చెప్పు చూపించాడని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అయితే, బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూభారతి బిల్లు తీసుకొస్తున్నారు. ఈ బిల్లు విషయంలో మంత్రి పొంగులటి శ్రీనివాస్ రెడ్డి చర్చిస్తుండగానే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ కారు రేసు కేసుపై చర్చించాలని పట్టుబట్టింది. ఈ తరుణంలో ధరణిపై పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధరణికి అప్పుడే నూరేళ్లు నిండాయని సెటైర్లు వేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.

స్పీకర్‌పై బీఆర్ఎస్ సభ్యులు దాడికి దిగినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. సభలో గూండాగిరి, దాదాగిరి చేస్తామంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో నాపైన, స్పీకర్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. స్పీకర్ పైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూభారతి 2024 చట్టంను ఆమోదం తెలపకుండా ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలా సమసమాజం సిగ్ంగు పడేలా రౌడీయిజం, గూడాగిరి చేయడం తగదన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తప్పుతడక అని మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసని పొంగులేటి అన్నారు. ఆయన 80వేల పుస్తకాలు చదివారని, అందుకే పుస్తకాలను చదివి ఈ ధరణిని తీసుకొచ్చారని అనుకునేవాళ్లమని చెప్పారు. కానీ ఆ చట్టానికి అప్పుడే వందేళ్లు నిండాయని అన్నారు.

Exit mobile version