Site icon Prime9

Minister Nara Lokesh: వాట్సాప్‌ ద్వారా 153 సేవలు

Minister Nara Lokesh on 153 Govt Services on a Single Platform: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వాట్సాప్‌ ద్వారా 153 సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సమాచారమంతా ఒకేచోట ఉండేలా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతున్నారు. వాట్సాప్‌ గవర్నన్స్‌పై కాన్ఫరెన్స్‌లో కీలక చర్చ జరుగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వాట్సాప్‌ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. 10 రోజుల్లో సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విధానాన్ని రీఇంజినీరింగ్‌ చేయాల్సి ఉందని మంత్రిపేర్కొన్నారు. యూఏఈ మాత్రమే ఒకేప్లాట్‌ఫామ్‌పై పౌరసేవలు అందిస్తోందన్నారు. అపార్‌ ఐడీజారీలో ఇబ్బందులను సరి చేస్తున్నామని లోకేష్ తెలిపారు.

Exit mobile version