Meta Movie Gen Launch: సోషల్ మీడియా యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌‌లో సరికొత్త ఏఐ టూల్!

Meta Movie Gen Launch: మెటా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. సంస్థ తన అన్ని ప్లాట్‌ఫామ్‌లు, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ని ‘AI’తో ఏకీకృతం చేసింది. ఇప్పుడు కంపెనీ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించడానికి మూడు ప్లాట్‌ఫామ్‌లకు కొత్త AI ఫీచర్లను జోడిస్తోంది. ఈ సిరీస్‌లో కంపెనీ ఇప్పుడు కొత్త AI టూల్‌తో ముందుకు వచ్చింది. కంపెనీ ఈ కొత్త AI టూల్ పేరు ‘Meta Movie Gen’.

మీ కష్టతరమైన అనేక పనులు చాలా సులభతరంగా మారే విధంగా Meta Movie Genని కంపెనీ రూపొందించింది. ఇది టెక్స్ట్ టు వీడియో AI సాధనం. ఈ టూల్ సహాయంతో మీరు రాసిన పదాలను వీడియో ఫార్మాట్‌లోకి మార్చగలరు.

మెటా మూవీ జెన్ ఏఐ టూల్ మీకు నెక్స్ట్ లెవల్ అనుభవాన్ని అందించబోతోంది. దీనిలో మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. దీంతో మీరు హై క్వాలీటీ వీడియోని సృష్టించవచ్చు. ఈ AI టూల్‌ను సాధారణ వినియోగదారులతో పాటు ప్రొఫెషనల్ యూజర్లు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా కంపెనీ కస్టమైజ్ చేసింది. ఈ టూల్ సహాయంతో మీరు శబ్ధాన్ని కూడా సృష్టించవచ్చు.

ప్రాంప్ట్‌ల ద్వారా వీడియోలను సృష్టించడమే కాకుండా ఈ టూల్ వీడియోలను ఎడిట్ చేయగట సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. దీని ద్వారా మీ పాత ఫోటోలను వీడియోలుగా మార్చుకోవచ్చు. కంపెనీ ప్రకారం ఈ టూల్ వీడియో క్రియేటర్స్ వారి సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ టూల్ అభివృద్ధి దశలో ఉంది. భవిష్యత్తులో అనేక అప్‌డేట్‌లతో రానుంది.

ఇటీవల మెటా తన అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌‌ని తీసుకొచ్చింది. వాట్సాప్‌లోని Meta AI టూల్ ద్వారా మీరు వివిధ ఫోటోలు, వీడియోలను చాలా సులభంగా క్రియేట్ చేయచ్చు. అదనంగా Meta AI టూల్ మీకు ఇన్‌స్టాంట్ మెసేజ్ ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌ను చూసేందుకు కూడా వీలు కల్పిస్తుంది.