Mega Parent-Teacher Meet to be held in AP Govt Schools: ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్ మీట్ జరుగుతోంది. పిల్లల చదువులపై అవగాహన కోసం ఈ సమావేశం ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 40వేల స్కూళ్లలో పేరెంట్- టీచర్ మీట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు బాపట్లలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్, పేరెంట్స్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు.
బాపట్లలోని ఓ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలన్నారు. సమావేశం ఇందులో భాగంగా పాఠశాలలో ముగ్గులు వేసిన విద్యార్థుల తల్లులను అభినందించారు. కాసేపు సరదాగా ముచ్చటించారు. కాగా, దేశంలోనే ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం తొలిసారి కావడం విశేషం.
కడపలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. అంతకుముందు కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన పవన్ కల్యాణ్ కడప మున్సిపల్ హై స్కూల్‌కి చేరుకున్నారు. ఈ మేరకు మున్సిపల్ హై స్కూల్ వద్ద పవన్ కల్యాణ్‌కు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు విద్యార్థులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.