Lava Agni 3 5G: స్టన్నింగ్ ఫీచర్స్.. డ్యూయల్ డిస్‌ప్లేతో లావ్ కొత్త ఫోన్.. లుక్ అదిరింది!

Lava Agni 3 5G: లావా తన అగ్ని సిరీస్‌లో కొత్త ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. లావా అగ్ని 3 5G పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. కొత్త లావా స్మార్ట్‌ఫోన్ వెనుక సెకండరీ స్క్రీన్‌తో డ్యూయల్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఐఫోన్ 15 ప్రో, 16 సిరీస్‌లో ఉండే యాక్షన్ బటన్ ఉంటుంది. ఫోన్ 6.78-అంగుళాల 3D కర్వ్డ్ ప్రైమరీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 7300X ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలానే 5000mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

లావా అగ్ని 3 5G ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో రానుంది. ఫోన్ 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,998. 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,998. అమెజాన్‌లో రూ.499తో ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ అక్టోబర్ 9న సేల్‌కి రానుంది. మీరు దీన్ని హీథర్ గ్లాస్, ప్రిస్టైన్ గ్లాస్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Lava Agni 3 5G Features
కొత్త Lava Agni 3 5G ఫోన్ 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ ప్రైమరీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వెనుకవైపు 1.74 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300X ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ Motorola Razr 50 ఫోల్డబుల్‌లో చూడవచ్చు. ఫోన్ 8GB RAM+256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 8GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.

లావా Agni 3 5G మొబైల్‌లో OIS + EISతో 50 మెగాపిక్సెల్ మెయిల్ కెమెరా ఉంది. ఇది 3X ఆప్టికల్ జూమ్ + EISతో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం ఈ ఫోన్ EISతో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. పవర్ కోసం 5,000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఇస్తుంది.

ఈ కొత్త లావా ఫోన్ ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది. మీరు రెండు Android అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల భద్రతా అప్‌డేట్‌లను పొందుతారు. ఇతర ఫీచర్లలో డాల్బీ అట్మోస్, USB టైప్-సి పోర్ట్, స్టీమ్ చాంబర్ కూలింగ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.