Prime9

Kichcha Sudeep: కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ ఇంట తీవ్ర విషాదం

Hero Sudeep Mother Died: కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్‌(86) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె అక్టోబర్‌ 20న తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో హీరో సుదీప్‌, అతడి కుటుంబం శోకసంద్రంలో ఉంది.

ఇక ఆమె మరణం పట్ల సుదీప్‌ అభిమానులు, ఇండస్ట్రీలో వర్గాల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్‌ మీడియాలో వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. చివరి చూపు కోసం సరోజ భౌతికకాయాన్ని బెంగళూరు జేపీ నగరోని సుదీప్‌ నివాసంలో ఉంచారు. ఆమె భౌతికకాయాన్ని సందర్శించేందుకు సినీ ప్రముఖులు జేపీ నివాసానికి చేరుకుంటున్నారు. నేడు సాయంత్రం సరోజ అంత్యక్రియలు జరగనున్నాయి.

Exit mobile version
Skip to toolbar