Site icon Prime9

Kadapa MLA Vs Mayor: మళ్లీ మొదలైన రగడ.. కార్పొరేషన్‌లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే

Kadapa MLA Madhavi Reddy Vs Mayor Suresh Babu: కడప కార్పొరేషన్‌లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. సర్వసభ్య సమావేశం వేదికపై మేయర్‌కు మాత్రమే కుర్చీ వేసి ఎమ్మెల్యేకు వేయకపోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు ఎందుకు కుర్చీ వేయలేదని మాధవరెడ్డి ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేదికపైకి వెళ్లి మేయర్ సురేష్‌తో ఎమ్మెల్యే మాధవరెడ్డి వాగ్వాదానికి దిగారు.

గత సమావేశంలో కూడా ఇదే అంశంపై మేయర్, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే మేయర్ తీరును నిరసిస్తూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు నిరసనకు దిగారు. అయితే వైసీపీ నేతలు, కూటమి నేతలు పోటాపోటీగా వేదికపైకి చేరుకున్నారు. కార్పొరేషన్ సమావేశపు హాల్‌లోకి వెళ్లేందుకు టీడీపీ నేతలతో పాటు మద్దతుదారులు భారీగా తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళలకు మేయర్ కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని నిరసనకు దిగారు.

కార్పొరేషన్ సమావేశంలో మేయర్‌తో టీడీపీ నేతలు వాగ్వాదం దిగడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మేయర్ భార్య జయశ్రీ పేరుతో కట్టిన పలు భవనాలకు అనుమతులపై కార్పొరేషన్ అధికారుల తీరును ప్రశ్నించారు. మహిళలంటే ఎందుకు అంత చిన్న చూపు అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా మేయర్ కుర్చీలాట ఆడుతున్నారని ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రశ్నించారు. మేయర్‌కు సలహా ఎవరు ఇచ్చారని, కడప నియోజకవర్గంలో మహిళలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు.వేదికపై ఎందుకు కుర్చీ వేయలేదని గత సంప్రదాయాలు ఎందుకు పక్కన పెట్టి రాజకీయంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

కడప కార్పొరేషన్‌కు సంబంధించి మేయర్‌గా సురేష్ బాబు కొనసాగుతున్నారు. ఆయనతో పాటు పక్కనే ఉన్న రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రెండు కుర్చీలు వేసేవారు. అటు కమలాపురం, ఇటు కడప నియోజవర్గ ఎమ్మెల్యేలకు ఆచారం ప్రకారం రెండు కుర్చీలు వేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన సర్వసభ్య సమావేశంలో యధావిధిగా జరిగింది. తర్వాత జరిగిన సర్వసభ్య సమావేశంలో మేయర్‌కు తప్పా ఎవరికీ కుర్చీ వేయకపోవడంతో సభ రసాభసాగా మారింది.

Exit mobile version