Johnson & Johnson: 2023 తో బేబీ పౌడర్ కు గుడ్ బై జాన్సన్ & జాన్సన్ నిర్ణయం

జాన్సన్ & జాన్సన్ తన ఐకానిక్ టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను 2023తో ప్రపంచవ్యాప్తంగా ముగించనున్నట్లు ప్రకటించింది. వివిధ దేశాల్లో చట్టపరమైనసవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ బేబీ పౌడర్‌ ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయించింది.

  • Written By:
  • Updated On - August 25, 2022 / 08:43 AM IST

Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ తన ఐకానిక్ టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను 2023తో ప్రపంచవ్యాప్తంగా ముగించనున్నట్లు ప్రకటించింది. వివిధ దేశాల్లో చట్టపరమైనసవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ బేబీ పౌడర్‌ ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీ ఇప్పటికే యూఎస్ మరియు కెనడాలో తన బేబీ పౌడర్ అమ్మకాలను ముగించింది. ఈ పౌడర్ అక్కడ క్యాన్సర్‌కు కారణమైందని పేర్కొంటూ వేలాది వ్యాజ్యాలు నమోదయ్యాయి

ప్రపంచవ్యాప్త పోర్ట్‌ఫోలియో అసెస్‌మెంట్‌లో భాగంగా, మేము అన్ని కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ పోర్ట్‌ఫోలియోకి మారడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జాన్సన్ & జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు జాన్సన్ & జాన్సన్ టాల్కమ్ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్‌కు గురయ్యామని 19,400 కేసులు నమోదయ్యాయి.

జాన్సన్ టాల్క్ బేబీ పౌడర్ సురక్షితమైనదని మరియు క్యాన్సర్‌కు కారణం కాదని కంపెనీ చెబుతోంది. 2018 రాయిటర్స్ పరిశోధనలో J&J తన టాల్క్ ఉత్పత్తులలో ఆస్బెస్టాస్ అనే క్యాన్సర్ కారకం ఉందని తెలిసింది.