Site icon Prime9

Jio Offer: జియో నుంచి ఊహించని గిఫ్ట్.. ఒకే రిఛార్జ్‌లో బోలెడు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!

Jio Offer

Jio Offer

Jio Offer: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అదిరిపోయే శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా గొప్ప బహుమతిని అందించింది. జియో తన రూ.1029 ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిశ్శబ్దంగా అప్‌డేట్ చేసింది. ఇప్పుడు తక్కువ ధరకే ఈ ప్లాన్‌ను ఎంజాయ్ చేయచ్చు. అంతే కాకుండా ఇప్పుడు అమెజాన్ లైట్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. మీరు జియో ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. ఈ ప్యాక్ ధరలో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే జియో ఏకైక ప్లాన్ ఇది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంతకుముందు జియో రూ. 1029 రీఛార్జ్ ప్లాన్‌లో 56 రోజుల వాలిడిటీతో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్ అందించేది. ఇప్పుడు జియో ఈ ప్లాన్‌ను అప్‌డేట్ చేసింది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను 84 రోజుల వాలిడిటీ పొందుతారు. అది కూడా పాత ధర అంటే రూ. 1029 మాత్రమే.

84 రోజుల వాలిడిటీ, 84 రోజుల అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కాకుండా జియో ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు అన్ని నెట్‌వర్క్‌లో అన్‌లటడ్ కాలింగ్ పొందుతారు. డైలీ 100 SMS, డైలీ 2GB డేటా అంటే మొత్తం 168GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంది. అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించడానికి Jio 5G నెట్‌వర్క్ తప్పనిసరిగా మీ ప్రాంతంలోఉండాలి. మీ వద్ద 5G ఫోన్ కూడా ఉండాలి. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ కూడా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ లైట్ HD (720p)లో రెండు డివైజ్స్‌లో (TV లేదా మొబైల్) స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. ఉచిత వన్-డే డెలివరీని అందిస్తుంది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్ ఒకే మొబైల్ డివైజ్‌కి మాత్రమే పరిమితం చేయబడింది. స్టాండర్డ్ డెఫినిషన్ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.

ఎయిర్టెల్ రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీతో వస్తుంది. డైలీ 3GB డేటా (మొత్తం 168GB), అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు డైలీ 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో Airtel Extreme Play Premium (22+ OTTలు), స్పామ్ కాల్ అలర్ట్, అపోలో 24/7 సర్కిల్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పాటు ఉచిత HelloTunes వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంది.

ఎయిర్‌టెల్ రూ. 1199 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. అలానే డైలీ 2.5GB డేటా (మొత్తం 210GB), అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు డైలీ 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో Airtel ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం (22+ OTTలు), స్పామ్ కాల్ అలర్ట్, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్ అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్‌లో కూడా అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంది.

Exit mobile version