Site icon Prime9

Israel and Hamas war: గాజాపై మరోసారి ఇజ్రాయెల్‌ దాడి..26 మంది మృతి 

Israeli airstrikes on Gaza mosque kill 26, injure 93: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలోని ఓ మసీదులో దాడి చేసింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. 93 మందికి తీవ్ర గాయాలైనట్లు హమాస్ తెలిపింది.  డెయిర్ అల్-బలాహ్ పట్టణంలో ఉన్న ఓ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారు. ఈ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో మరణించిన వారంతా పురుషులేనని వెల్లడించింది. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ ఖండించింది. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని గుర్తించి ధ్వంసం చేశామని పేర్కొంది.

Exit mobile version