Site icon Prime9

IPS officer Sanjay: విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో వెలుగులోకి అక్రమాలు.. మాజీ ఐపీఎస్ సంజయ్‌పై సస్పెన్షన్ వేటు

Irregularities of IPS officer Sanjay: ఏపీ సీఐడీ విభాగం మాజీ అధిపతి, ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయన అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన సమయంలో ఆ అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో కుమ్మక్కైనట్లు నిర్ధారించింది. పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్లు గుర్తించింది.

నాటి నేతలకు తొత్తుగా..
సీఐడీ విభాగం మాజీ అధిపతి, ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌ అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన సమయంలో ఆ అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో కుమ్మక్కైనట్లు నిర్ధారించింది. పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. ఆయన బిడ్‌ రిగ్గింగ్, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాతానికి, విశ్వాతఘాతుకానికి పాల్పడినట్లు తేల్చింది.

లోయెస్ట్‌ బిడ్డర్‌ కాకున్నా ఓకే
అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలను (ఎన్‌వోసీ) ఆన్‌లైన్‌లో జారీచేసేందుకు వీలుగా అగ్ని-ఎన్‌వోసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కోసం అగ్నిమాపక శాఖ డీజీ హోదాలో ఎన్‌.సంజయ్‌ 2023 జనవరిలో టెండర్లు పిలిచారు. బిడ్లు సమర్పించేందుకు కొన్ని సంస్థలనే ఆహ్వానించారు. దీంతో మూడు సంస్థలే బిడ్లు వేశాయి. సౌత్రిక టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఎల్‌-1గా ఎంపిక చేశారు. ఆ సంస్థ లోయెస్ట్‌ బిడ్డర్‌ కాకపోయినా.. కాంట్రాక్టు కట్టబెట్టారు. బిడ్ల సాంకేతిక మదింపు హడావుడిగా ముగించారు. ఈ క్రమంలో సౌత్రిక సంస్థను ఎల్‌1గా ఎంపిక చేయడంలో.. ఆ సంస్థ అనుభవం, సమర్థతలను పరిగణనలోకి తీసుకోలేదు.

అడుగడుగునా అక్రమాలే
అగ్నిమాపక శాఖాధికారుల కోసమంటూ ఒక్కో ల్యాప్‌టాప్, ఐపాడ్‌కు రూ.1.78 లక్షలు వెచ్చించి 10 పరికరాలను సౌత్రిక టెక్నాలజీస్‌ నుంచి సంజయ్‌ కొనుగోలు చేశారు. వాటి మార్కెట్‌ ధరకంటే అధిక ధరలకు కొన్నారు. దీని కోసం రూ.17.89 లక్షలు ఆ సంస్థకు చెల్లించారు. టెండర్లు, కాంపిటీటివ్‌ బిడ్లు లేకుండానే ఆ సంస్థకు వీటి సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారు. కనీసం బిల్లులూ సమర్పించలేదు. దీనిలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి.

బొక్కిన సొమ్ము కక్కించండి
ఆయన బిడ్‌ రిగ్గింగ్, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాతానికి, విశ్వాతఘాతుకానికి పాల్పడినట్లు తేల్చింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ నివేదిక సమర్పించింది. సంజయ్‌పై కేంద్ర సివిల్‌ సర్వీసుల నియమావళి ప్రకారం, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. సౌత్రిక టెక్నాలజీస్‌ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి.. దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేయాలని నివేదించింది. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక ఆధారంగా సంజయ్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్‌ సమయంలో హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని ఉత్వర్వుల్లో పేర్కొంది.

Exit mobile version