Infinix Smart 9: టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కంపెనీ తన కొత్త ఫోన్ Infinix Smart 9ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ చౌక స్మార్ట్‌ఫోన్‌ను తొలిసారిగా మలేషియాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్లలో లాంచ్ అయే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ప్రైస్‌లో లాంచ్ అవుతున్నప్పటికీ అనేక అద్భుతమైన ఫీచర్లను ప్యాక్ చేస్తుంది.
ఫోన్‌లో ఆక్టా-కోర్ మెడిటెక్ Helio G81 ప్రాసెసర్, 6.7-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 4GB RAM + 128GB స్టోరేజ్, 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? ధర, తదితర వివరాలు తెలుసుకుందాం.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 ఫోన్ మలేషియాలో 3GBRAM+64GB, 4GB+128GB స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. 3GBRAM+64GB ధర రూ.6,200గా ఉంది. 4GB+128GB ధర వెల్లడించలేదు. ఈ ఫోన్ బ్లాక్, మింట్ గ్రీన్, ో్డ్, సిల్వర్ కలర్స్‌లో ఆర్డర్ చేయవచ్చు. భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవతుందో కంపెనీ త్వరలో వెల్లడించనుంది.
Infinix Smart 9 Features
ఈ ఫోన్ 6.7-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 90.2 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 500 nits బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ మీడియాటెక్ హీలియో G81 ఆక్టా కోర్ ప్రాసెసర్‌లో కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఈ 8 కోర్ CPUలో 2.0 GHz క్లాక్ స్పీడ్‌తో 2 Cortex-A75 కోర్స్, 1.7 GHz క్లాక్ స్పీడ్‌తో 6 Cortex-A55 కోర్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ AM Mali G52 MC2 GPUకి సపోర్ట్ ఇస్తుంది.
ఈ మొబైల్ Android 14 Go వెర్షన్‌లో రన్ అవుతుంది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఈ ఫోన్ 3GB, 4GB RAMని సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు వేరియంట్లలో వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ఉంది. 64 GB, 128 GB స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. రెండింటిలో 2TB మెమరీ కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేయవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది డ్యూయల్ LED ఫ్లాష్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కంపెనీ 5,000mAh కెపాసిటీ బ్యాటరీతో మొబైల్‌ను విడుదల చేసింది. ఫుల్ ఛార్జ్ తర్వాత 34 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఫోన్ USB టైప్-సి పోర్ట్, 10W ఛార్జింగ్ టెక్నాలజీనితో వస్తుంది. ఇతర ఫీచర్లలో 3.5 mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో, డ్యూయల్ స్పీకర్లు, IP54 రేటింగ్, OTG ఉన్నాయి.