Site icon Prime9

India Vs Pakistan: హై ఓల్టేజ్.. కాసేప్లటో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. పైచేయి ఎవరిదో?

India Vs Pakistan

India Vs Pakistan

India Vs Pakistan: హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత దుబాయ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మరోవైపు శ్రీలంకపై విజయం తర్వాత పాక్ జట్టు రంగంలోకి దిగనుంది.

2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 31 పరుగుల తేడాతో ఓడించి శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఫాతిమా సనా అద్భుత ప్రదర్శన చేసి 10 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. ఇది కాకుండా ఆమె బ్యాటింగ్‌లో 30 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ కూడా ఆడారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈ హై ఓల్టేజీ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది

భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), యాస్తికా భాటియా (WK), పూజా వస్తరాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజ్నా సజీవన్.

పాకిస్తాన్ జట్టు
ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, గుల్ ఫిరోజ్, ఇరామ్ జావేద్, మునిబా అలీ, నష్రా సుంధు, నిదా దార్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్ (ఫిట్ అయితే), సిద్రా అమీన్, సయీదా అరుబ్ షా, తస్మియా రుబాబ్ , తుబా హసన్.

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు పాక్‌తో ఆడిన 7 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా 5 గెలిచింది. చివరి టీ20 ప్రపంచకప్ మ్యాచ్ 2023లో కేప్ టౌన్‌లో జరిగింది. ఇందులో భారత్ 7 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. ఓవరాల్‌గా రికార్డుల పరంగా చూస్తే.. భారత మహిళల జట్టు 15 టీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 12 గెలిచి ముందంజలో ఉంది.

Exit mobile version