Site icon Prime9

India vs New Zealand: స్పిన్ మాయాజాలం.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్

India vs New Zealand third test match: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ స్పిన్ మాయాజాలానికి కివీస్ బ్యాటర్లు బోల్తా పడ్డారు. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కట్టడి చేశారు. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది.

మ్యాచ్ ప్రారంభమైన నాలుగో ఓవర్‌లోనే ఆకాశ్ దీప్ వికెట్ తీశాడు. కాన్వే (4) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. తర్వాత తొలిసెషన్ పూర్తయ్యే సరికి కివీస్ 3 వికెట్లు కోల్పోయింది. లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. సుందర్ బౌలింగ్‌లో లాథమ్, రవీంద్ర క్లీన్ బౌల్డ్ అయ్యారు. యంగ్(71), మిచెల్(82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో కివీస్ 65.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, ఆకాశ్ వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్.. ఆరో ఓవరల్లో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(18) హెన్నీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం యశస్వీ జైశ్వాల్(18), శుభమన్ గిల్(6) క్రీజులో ఉన్నారు. భారత్ వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. దీంతో భారత్.. ఇంకా 189 పరుగుల వెనుకంజలో ఉంది.

Exit mobile version