Site icon Prime9

India vs Bangladesh: భారత్, బంగ్లాదేశ్ తొలి టీ20 మ్యాచ్.. జట్టు ఇదే!

India vs Bangladesh first t20 match: బంగ్లాదేశ్‌తో భారత్ తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. గ్వాలియర్ వేదికగా మాధవరావ్ సింధియా స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 14 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

కాగా, గ్వాలియర్‌లో కొత్తగా పునర్నిర్మించిన శ్రీమంత్‌ మాధవరావు సింధియా స్టేడియంలో 14 ఏళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరగనుండటం గమనార్హం. ఇటీవలే ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించింది.

జట్ల అంచనా:

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్(C), శివమ్ దూబే, రింకూ సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్/వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్/మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

బంగ్లాదేశ్: లిట్టన్ కుమార్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), తౌహిద్ హదయ్, మహమదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, తాంజ్.

Exit mobile version