India vs Australia 2nd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. అడిలైడ్ వేదికగా పింక్ బాల్ డే/పైట్ మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు ఆట ప్రారంభమైంది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.
రెండో రోజు ఆట కొనసాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 310 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. సెంచరీ వీరుడు ట్రావిస్ హెడ్(140)ను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 130 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బ్యాటర్లలో లబుషేన్(64), మెక్ స్వీనీ(39) పరుగులు చేయగా.. అలెక్స్ కేరీ(15), మిచెల్ మార్ష్(9), స్టీవ్ స్మిత్(2) విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, మహ్మద్ సరాజ్ రెండు వికెట్లు తీయగా.. నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు తొలి సెషన్ పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో డేంజరస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(64) ఔటయ్యాడు. నితీశ్ వేసిన బంతిని లబుషేన్ ఆడేందుకు ప్రయత్నించి యశస్వి చేతికి చిక్కాడు. దీంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.
ఇదిలా ఉండగా, రెండో రోజు ఆసీస్ బ్యాటర్లు మెక్ స్వీనీ, మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చారు. నిలకడగా ఆడుతున్న మెక్ స్వీనీ(39) పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులో కి వచ్చిన స్టీవ్ స్మిత్(2) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు.