Site icon Prime9

India vs Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

India beat Bangladesh by 86 runs: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మనోళ్లు అదరగొట్టారు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.

భారత్ తొలుత నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నితీశ్‌ రెడ్డి (74), రింకు సింగ్ (53), హార్దిక్ పాండ్య (32) రాణించగా.. సంజు శాంసన్ (10), అభిషేక్ శర్మ(10), సూర్యకుమార్‌ యాదవ్ (8) నిరాశపర్చారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, తంజిమ్, ముస్తాఫిజుర్, రిషాద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

222 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మహ్మదుల్లా (41), పర్వేజ్ హొస్సేన్ (16), లిటన్ దాస్ (14), నజ్ముల్ శాంటో (11), తౌహిద్ హృదయ్ (2), మెహిదీ హసన్ మిరాజ్ (16) పరుగులు చేశారు. భారత బౌలర్లలో నితీశ్‌ 2, చక్రవర్తి 2, అర్ష్‌దీప్, సుందర్, అభిషేక్, మయాంక్, పరాగ్ తలో వికెట్ పడగొట్టారు.

Exit mobile version