Site icon Prime9

Today Horoscope February 05: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని లాభాలు!

Horoscope Today in Telugu February 05: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.

మేషం – ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని సమయాల్లో తీసుకున్న రుణాలు ఇబ్బందులకు గురి చేస్తుంది.

వృషభం – వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. దూరప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

మిథునం – పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కీలక వ్యవహారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

సింహం – పరపతి పెరుగుతుంది. వ్యాపారంలో రొటేషన్ సంతృప్తికరంగానే ఉంటుంది. లాభాలు గతంలో కంటే బాగుంటాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య – నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం. అభివృద్ధి కార్యక్రమాలకు గాను రుణాలు మంజూరు అవుతాయి. మొండి సమస్యలు తీరిపోతాయి.

తుల – అనుకూలంగా వస్తాయనుకున్న ప్రతిఫలాలు మీకు ప్రతికూలంగా రావడం మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం – వ్యాపార పరంగా లాభాలు అందుకుంటారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.సన్నిహితుల సహాయ సహకారాల వల్లనే ఇదంతా సాధించగలిగామని ఆత్మసంతృప్తి మిగులుతుంది.

ధనుస్సు – మిమ్మల్ని సూటిపోటి మాటలతో గేలి చేసే వ్యక్తులు అధికమవుతారు. కొంతమంది మీపై లేని నిందలు మోపుతారు. ఊహించని ఫలితాలు ఎదురవుతాయి.

మకరం – శుభవార్తలు అందుకుంటారు. అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు.ఖర్చుకు వెనకాడరు.
మీ సన్నిహిత వర్గం విజయం, మీ విజయంగా భావిస్తారు.అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు.

కుంభం – ముఖ్యమైన వ్యవహారాలపైన దృష్టి సారిస్తారు. వృత్తి- ఉద్యోగాలు అనుకూలిస్తాయి. మీరు ఆశించిన ఫలితాలు అంతంత మాత్రమే అందుతాయి. మనోబలంతో ముందడుగు వేస్తారు.

మీనం – ఉపయోగకరమైన శుభ ఫలితాలను అందుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు.

Exit mobile version
Skip to toolbar