Horoscope Today: సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం: ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. ఆర్ధిక విషయాల్లో సానుకూలత ఉంటుంది. రాదనుకున్న నగదు చేతికి అందుతుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు.
వ్యాపారంలోనూ, వృత్తులలోనూ మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కొత్త ఆలోచనలకు చక్కని ఫలితాలు ఉంటాయి. తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభం: అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. నేడు ఈ రాశివారికి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ పరంగా శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..
మిథునం: ఆర్ధిక సమస్యలు పరిష్కారం అవుతాయి. రాదనుకున్న నగదు చేతికి అందుతుంది. ఉద్యోగ పరంగా ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తిస్తారు.వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వినటానికి అవకాశం ఉంది.
కర్కాటకం: ఉద్యోగం విషయంలో సానుకూలత ఉంటుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.
సింహం: నేడు ఈ రాశివారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం విషయంలో సమస్యలు ఉంటాయి. శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుంది. ఇతరులకు సహాయపడతారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ఎవరికీ హామీలు ఉండవద్దు. బంధుమిత్రులు అండగా ఉంటారు.
కన్య: నేడు ఈ రాశివారికి జీవితం సాఫీగా సాగిపోతుంది. లక్ష్యాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి.
తుల: ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు ఉదారంగా సహాయం చేస్తారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
ఉద్యోగంలో గౌరవ అభిమానాలు పెంపొందుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్య తలు అప్పగిస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
మానసిక ప్రశాంతత..
వృశ్చికం: నేడు ఈ రాశివారికి రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్ధిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది.
ధనుస్సు: తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.
ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉచిత హామీలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం.
మకరం: వృత్తి వ్యాపారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి.
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కుంభం: ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉంటాయి. మానసికి ప్రశాంతత అవసరం.
అనుకోని పని ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మీనం: ఆదాయ పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
ఉద్యోగంలో సంపాదన, వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో అధికారులు సహాయంతో ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు.