Horoscope Today: నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రజలు విశ్వసించే విధానం.. జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.
మేషం: నేడు ఈ రాశివారికి రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న నగదు చేతికి అందుతుంది. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సమీప బంధువులకు సాయం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృషభం: ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాటితో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది.
ఈ రాశి వారికి పనిభారం..
మిథునం: ఉద్యోగం విషయంలో పనిభారం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. టీచర్లకు, కళాకారులకు, రియల్ ఎస్టేట్ వారికి, ఐటీ వారికి సమయం అనుకూలంగా ఉంది.
కర్కాటకం: నేడు ఈ రాశివారికి సమయం అనుకూలంగా ఉంది. రైతులకు అనుకూల కాలం ఉంది. ఆర్ధిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏళ్లుగా ఉనన బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
సింహం: కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు అవసరం. అనవసర విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. దూరప్రాంతాల నుంచి మంచి సమాచారం అందుకుంటారు.
కన్య: వ్యాపారంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు గడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ముందుకు దూసుకు వెళతారు. అధికార యోగానికి అవకాశం ఉంది.
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధు వర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
తుల: ఆర్థిక పరిస్థితి నామమాత్రంగా ఉంటాయి. కుటుంబం నుంచి ఆర్ధిక సాయం పొందుతారు. రుణ సమస్యలను తగ్గించుకోవడం మంచిది.
నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. పని విషయంలో బాధ్యతులు పెరుగుతాయి.
వృశ్చికం: చిన్న వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ నాయకులకు సమయం అన్ని విధాలుగాను బాగుంటుంది.
ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది.
స్నేహితుల సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి.
ఆర్ధిక విషయాల్లో జాగ్రత్త..
ధనుస్సు: ఈ రాశి వారికి నేడు మంచి జరగనుంది. రుణ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.
సమాజంలో మీ విలువ పెరుగుతుంది. రాజకీయంగా పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగం విషయంలో ఓ శుభవార్త వింటారు.
మకరం: ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది.
బంధువులకు అండగా ఉంటారు. ఉద్యోగం విషయంలో ఓ శుభవార్త వింటారు.
కుంభం: వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి కనిపిస్తోంది. కోర్టు కేసు ఒకటి సానుకూలంగా మారుతుంది.
కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పెడతారు. డబ్బు జాగ్రత్త.
మీనం: వివిధ రంగాలకు చెందినవారు ఆర్ధిక ప్రయోజనం పొందుతారు. ఉద్యోగుల ఆర్ధిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రుణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.