HMPV Virus cases in India Increase to Seven: ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19 వైరస్‌ను మరువక ముందే మరో వైరస్ ముంచుకొస్తుంది. చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, భారత్‌లో కూడా హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దేశంలో మొదటి కేసు కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 8 నెలల చిన్నారికి వచ్చింది. అదే రోజు మరో 3 నెలల చిన్నారికి సైతం పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
బెంగళూరులో రెండు కేసులో నమోదవ్వగా.. సేలం, అహ్మదాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో రెండు కేసులు తేలగా.. తాజాగా, మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య ఏడుకు చేరాయి. అయితే ఇప్పటివరకు ఈ వ్యాధిన బారిన పడిన వారంతా 3 నెలల నుంచి 13 ఏళ్ల వయసులోనే ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
వైరస్ వచ్చిన పిల్లల్లో ప్రధానంగా ఫ్లూ లక్షణాలు కనపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే జ్వరం, దగ్గు ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఎలాంటి యాంటిబయోటిక్స్ అవసరం లేదని, తగినన్ని నీటిని తీసుకోవాలని చెప్పారు. సాధారణంగా జ్వరం, బాడీ పెయిన్స్ తగ్గించే మందులను వేసుకుంటే వారం రోజుల్లో తగ్గిపోతుందని సూచించారు. ఈ వైరస్ ప్రాణాంతకమైందని కాదని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే ఈ వైరస్ పలు దేశాల్లో ఉన్నట్లు గుర్తించామని, సాధారణ చికిత్సతోనే నయమవుతుందని వివరించారు.