Site icon Prime9

Haryana elections 2024: ముగిసిన హర్యానా ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌లో గెలుపెవరిదంటే?

Haryana Exit Poll Result 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. 1,031 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైంది.

కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్, సీఎన్ఎన్, రిపబ్లిక్ మ్యాట్రిజ్, దైనిక్ భాస్కర్ సంస్థలు అంచనా వేశాయి.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలో మొత్తం హర్యానాలో 90 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ 46 నుంచి 50 సీట్లు సాధించనున్నట్లు సర్వే అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడం ఖాయమని తేల్చి చెప్పింది. హర్యానాలో రెండుసార్లు విజయం సాధించిన బీజేపీకి కేవలం 20 నుంచి 32 సీట్లు మాత్రమే తక్కనున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్ాలి భావించినా బీజేపీ నిరాశ తప్పదని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

అదే విధంగా హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్ తగలనుందని సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. అధికారంలో ఉన్న బీజేపీకి 21 సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రం 59 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని పేర్కొంది. రిపబ్లిక్ భారత్, మ్యాట్రిజ్ సర్వే సైతం కాంగ్రెస్‌దే అధికారమని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 55 నుంచి 62 సీట్లు దక్కించుకోగా.. బీజేపీకి మాత్రం 18 నుంచి 24 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, ఈనెల 8న జమ్మూకశ్మీర్‌తో పాటు హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Exit mobile version