Site icon Prime9

Dabur brands: రూ.1,000 కోట్లకు పైగా టర్నోవర్ చేసిన నాలుగు ’డాబర్‘ ఉత్పత్తులు

Business: ఎఫ్ఎంసిజి సంస్ద డాబర్ ఇండియా లిమిటెడ్ తమ కంపెనీకి చెందిన నాలుగు బ్రాండ్లు 1,000 కోట్లకు పైగా టర్నోవర్ కలిగి ఉన్నాయని తన వార్షికనివేదికలో తెలిపింది. కంపెనీకి చెందిన రెండు బ్రాండ్లు-డాబర్ హనీ మరియు డాబర్ చ్యవన్‌ప్రాష్ – రూ. 500 కోట్లకు పైగా అమ్మకాలను కలిగి ఉన్నాయి.

2021-22 ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ. 100 కోట్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న 12 బ్రాండ్లు, రూ. 500 కోట్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న రెండు బ్రాండ్లు మరియు రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన మరో నాలుగు బ్రాండ్లు ఉన్నాయని డాబర్ ఇండియా తన వార్షిక నివేదికలో పేర్కొంది. .

నాలుగు బ్రాండ్లు డాబర్ ఆమ్లా, డాబర్ వాటికా, డాబర్ రెడ్ పేస్ట్ మరియు జ్యూస్ బ్రాండ్ రియల్. అలాగే ”ఈ ఆర్థిక సంవత్సరం (FY22) చివరి నాటికి, మాకు మరో రెండు బ్రాండ్‌లు ఉన్నాయి. మెస్వాక్ మరియు రియల్ డ్రింక్స్ ప్రతిష్టాత్మకమైన బిలియన్ రూపాయల టర్నోవర్ క్లబ్‌లో (రూ. 100 కోట్లు) చేరాయి.” మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి, కార్యకలాపాల ద్వారా డాబర్ ఇండియా ఆదాయం రూ. 10,889 కోట్లుగా ఉంది. గత ఎనిమిదేళ్లలో అత్యధిక వార్షిక ఆదాయ వృద్ధిని సాధించింది. మా కన్సాలిడేటెడ్ ఆదాయం 13.9 శాతం వార్షిక వృద్ధితో మొదటిసారిగా రూ. 10,000 కోట్ల మార్కును దాటింది” అని డాబర్ ఇండియా వైస్ ఛైర్మన్ మోహిత్ బర్మన్ షేర్ హోల్డర్లను ఉద్దేశించి అన్నారు.

Exit mobile version